రైతు భరోసా కేంద్రాలను రైతు దివాళా కేంద్రాలుగా మార్చొద్దు
ప్రభుత్వ అండతో మిల్లర్లు రైతులను ముంచుతున్నారు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు
విజయవాడ : ‘జగనన్నకు చెబుదాం’ అంటూ ఇప్పుడు ఆర్బాటంగా ప్రారంభించినా
ఇప్పటివరకు జగనన్నకు చెప్పుకున్న సమస్యలను ఎన్నింటిని పరిష్కరించారని సిపిఎం
రాష్ట్రకార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రశ్నించారు. నాలుగేళ్ల నుంచి
నిర్వహిస్తున్న స్పందనలో ఏ ఒక్క సమస్యను పరిష్కారం చూపడం లేదని
పేర్కొన్నారు. కార్పోరేట్ కాల్ సెంటర్ తరహాలో ఆపరేటర్ ఎత్తి రెస్పాండ్
అయ్యే కార్యక్రమానికి జగనన్నకు చెబుదామని బిల్డప్ ఎందుకని ప్రశ్నించారు.
విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతు భరోసా కేంద్రాలను రైతు దివాళా కేంద్రాలుగా మార్చొద్దు : ఈ నాలుగేళ్లలో
ప్రభుత్వానికి ఎన్నో సమస్యలను నివేదించినా ఏ ఒక్కదానికి పరిష్కారం చూపడంలేదని
అన్నారు. ఇటీవల కాలంలో ధాన్యం సేకరణ అంశంలో రైతుల పడుతున్న ఏ ఒక్క సమస్యకు
పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు కాస్తా రైతు దివాళా
కేంద్రాలుగా మారాయని తెలిపారు. మిల్లర్ల దయాదాక్షిణ్యాలపైకి వదిలేసారు తప్ప
రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల్లో
తీసుకున్న ప్రమాణాలు మిల్లర్ల వద్దకు పోగానే మారిపోయి తేమ, నూక, తాలు పేరుతో
బస్తాకు ఏడు నుండి 12 కేజిల కోత పెడుతున్నారని అన్నారు. ఆ పేరుతో ట్రక్కుకు
రైతుల నుంచి రూ.7`10వేలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. వర్షాలకు తడిచిన
ధాన్యాన్ని ఎక్కడా కొనుగోలు చేయడం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో
అందుబాటులో ఉంచుతామని చెప్పిన డ్రయ్యర్లు, క్లీనర్లు, టార్పాలిన్లు లేకుండా
పోయాయని చెప్పారు. గోనెసంచులు ఇవ్వడం లేదని, ఇచ్చినా పనికి రానివి ఎక్కువని
వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామి కూలీలకు చట్టప్రకారం రూ.400లు
ఇవ్వాల్సి వుండగా రూ.200కు మించి ఎక్కడా ఇవ్వడం లేదని, ఇది కూలీలకు గిట్టుబాటు
కావడం లేదని చెప్పారు.ఉపాధి కూలీలను వేధిస్తూ రెండు పూటలా పని చేయించి
ఉద్యోగులకు అమలు చేస్తున్నట్లు ఫేసియల్ హాజరు తీసుకోవడం తగదన్నారు. ఉపాధి
హామి పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
ఆపరేటర్ ఎత్తే ఫోన్‌కు జగనన్న చెబుదామనే బిల్డప్ ఎందుకు : మోడీ ప్రభుత్వం
సబ్సిడీ బియ్యంపై కోత పెట్టడంతో పేదలు గత 20ఏళ్లలో మొదటిసారిగా బియ్యాన్ని
కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిరదన్నారు. రాష్ట్రంలో రైతులు,
వ్యవసాయకార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్కీమ్‌వర్కర్లు, అసంఘటిత
రంగకార్మికులు, నిరుద్యోగులు, 98 డిఎస్సి నిరుద్యోగులు, పోలవరం
నిర్వాసితులు, గ్రామపంచాయతీ సర్పంచ్‌లు ఇలా అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో
సతమతమవుతున్నారని పేర్కొన్నారు. వీరి మొర ప్రభుత్వానికి వినిపించడం లేదా అని
ప్రశ్నించారు. వారితో ప్రత్యక్షంగా చర్చించకుండా కాల్సెంటర్లో ఆపరేటర్‌కు
సమస్యలను చెప్పుకోవాలనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. 1902
కాల్‌సెంటర్, టెక్నిక్‌లు, మాయలతో సమస్యలు పరిష్కారం కావని, నాలుగేళ్లుగా
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.ఆయా తరగతుల
ప్రతినిధులతో నేరుగా ముఖ్యమంత్రి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
ఇందులో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో, కృష్ణా జిల్లాల్లో అకాల వర్షాలకు
ఎక్కువగా నష్టపోయారని అన్నారు. పంటనష్టంపై ప్రభుత్వం చెబుతున్న దానికి
భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితితులు ఉన్నాయని చెప్పారు. గోనె సంచులు కూడా
ఇవ్వడం లేదని, కొన్ని చోట్ల అధికారపార్టీ నేతలు సూచించిన కొద్దిమందికే ఇచ్చారే
తప్ప రైతులందరికీ ఎక్కడా ఇవ్వడం లేదని అన్నారు. రైతులు పండిరచిన ప్రతిగింజను
కొంటామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం రకరకాల నిబంధనలు విధిస్తోందని
పేర్కొన్నారు. రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. పంట
పండిరచేందుకు రైతులు ఇప్పటివరకు పెట్టుబడి పెడితే ఈ ప్రభుత్వహయాంలో పంటను
అమ్ముకునేందుకు కూడా ట్రక్కుకు