విజయవాడ : పాలిసెట్ – 2023కు సంబంధించిన ప్రాధమిక “కీ” శనివారం విడుదల
చేస్తామని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం
పాలిటెక్నిక్ ప్రవేశాలకు నిర్దేశించిన పాలిసెట్ ప్రవేశపరీక్షను రాష్ట్ర
వ్యాప్తంగా నిర్వహించగా, కమీషనర్ ఎన్ టి ఆర్, గుంటూరు జిల్లాలలోని పలు పరీక్షా
కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్ధులు
ఎంట్రన్స్ పరీక్ష “కీ” కోసం వెబ్ సైట్ ను సందర్శించవచ్చన్నారు. ఫైనల్ “కీ”
సైతం సోమ, మంగళవారాలలో విడుదల చేస్తామన్నారు. ఎంట్రన్ ఫలితాలను రానున్న
పదిరోజుల్లో విడుదల చేసి వెంటనే ప్రవేశాలకు సంబంధించిన షేడ్యూలును సిద్దం
చేయనున్నామని నాగరాణి పేర్కొన్నారు. ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329
అభ్యర్థులు నమోదు కాగా, 1,43,592 (89.56 శాతం) మంది విద్యార్ధులు
హాజరయ్యారన్నారు. బాలికలు 63,201 కాగా 55,562 (87.91 శాతం) మంది, 97,128 మంది
బాలురకు గాను 88,030 (90.63 శాతం) మంది పరీక్ష రాసారు. 499 పరీక్షా కేంద్రాలకు
గాను 61 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాకు ఒకరి చొప్పున 26 మంది
పరీశీలకులను నియమించారు. ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ని
నియమించి పకడ్భందీగా పరీక్ష నిర్వహించామని నాగరాణి తెలిపారు. మరోవైపు సాంకేతిక
విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సైతం విజయవాడ లోని మేరీస్
స్టెల్లా, పటమట బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాలను సందర్శించారు.