వెలగపూడి : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో
పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి అద్దె బత్యాన్ని (హెచ్ఆర్ఏ)16 శాతానికి
పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వుల
సంఖ్య 69 ద్వారా రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్
ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన నూతన జిల్లాల జిల్లా
కేంద్రాలైన పార్వతీపురం, పాడేరు,అనకాపల్లి,అమలాపురం,భీమవరం,బాపట్ల,
నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటిల్లో పనిచేసే వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు
ప్రస్తుతం ఇస్తున్న 12 శాతం హెచ్ఆర్ఏను 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వచ్చే జూన్ 1వ తేదీ నుండి అమలులోకి
వచ్చే విధంగా జిఓలో స్పష్టం చేయడం జరిగింది.కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేసే
ఉద్యోగులకు 16 శాతం హెచ్ఆర్ఏ ప్రకటించడంతో ఇకమీదట రాష్ట్రంలోని అన్ని జిల్లా
కేంద్రాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఒకే విధంగా 16 శాతం హెచ్ఆర్ఏను
పొందనున్నారు.