విశాఖపట్నం : విశాఖ నగరాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచే విధంగా
అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి
పేర్కొన్నారు. బుధవారం ఆమె జోన్-4, 31వ వార్డులో చాకలిపేట, లక్ష్మి వీధి,
గొల్లలపాలెం పరిధిలో జీవీఎంసీ నిధులతో సుమారు రూ.40.00 లక్షల అంచనా వ్యయంతో
బిటి రోడ్డు, సిసి కాలువ, నడక వంతెన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి
గణేష్ కుమార్, వార్డు కార్పోరేటర్ బిపిన్ కుమార్ జైన్ తో కలసి శంకుస్థాపన
చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా 31వ
వార్డులో కార్పొరేటర్ విన్నపం మేరకు పలు అభివృద్ధి పనులు చేపట్టడం
జరిగిందని, అందులో భాగంగా 31వ వార్డు పరిధిలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో
లక్ష్మివీధి లో బిటి రోడ్డు, నడక వంతెన, సిసి డ్రైన్ నిర్మాణానికి నేడు
శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. వార్డులో మిగిలిన అభివృద్ధి
కార్యక్రమాలను త్వరలో ప్రారంభిస్తామని, 4వ జోన్ పరిధిలో తాగునీరు, వీధి దీపాల
నిర్వహణ, పారిశుద్ధ్యం ప్రత్యేక దృష్టి సారించి వార్డులో ప్రజలకు ఎటువంటి
ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్
జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వ
కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుందని, ప్రతి సంక్షేమ పథకాలు, అభివృద్ధి 95
శాతం పూర్తి చేసి శాసనసభ్యులతో గడపగడపకు వెళ్లడం జరుగుతుందని, వెళ్లిన ప్రతి
చోట మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇదే జగనన్న మంచి పాలనకు నిదర్శనమని
తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు
ఎన్నో చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శివ
ప్రసాద్, కార్యనిర్వాహక ఇంజనీర్లు డివి రమణమూర్తి, ఉప కార్యనిర్వాహక
ఇంజనీర్లు, సహాయక ఇంజినీర్లు, వైఎస్ఆర్ సిపి నాయకులు, వార్డు ప్రజలు
పాల్గొన్నారు.