కాకినాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రజల్లో మార్పు
రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు
సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తెలిపారు. తమ జాతి రిజర్వేషన్
జోకరు కార్డులా అయినందుకు భాధ పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారి
కోసం నేను చేసే ఉద్యమాలు, వారి చిరునవ్వే నాకు ఆక్సిజన్. తుని ఘటన తరువాత
నన్ను తిహార్ జైలుకు తీసుకువెళ్ళేందుకు హెలికాప్టర్ సిద్దం చేశారు. కోర్టుకు
వెళ్ళి బెయిల్ తెచ్చుకోమని, అండర్ గ్రౌండ్‌కు వెళ్ళమని సలహాలు ఇచ్చారు. ఒకవేళ
నేను అలా చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం చులకనయ్యే ప్రమాదంలో పడేదని ముద్రగడ
లేఖలో పేర్కొన్నారు.