ప్రతిపక్షాలకు ఛాలెంజ్
పూర్తిస్థాయి మౌలిక వస్తువులతో రాష్ట్రంలో 50 వేల టిడ్కో ప్లాట్లు నూరు శాతం
పూర్తి……
పదేపదే అబద్దాలతో టీడీపీ నేతలు చెబుతున్న ప్లాట్లకు-అభివృద్ధి చేసి నేడు
ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్న ఇళ్లకు అసలు పోలికే లేదు
అతి త్వరలో గుడివాడలోని టిడ్కో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
చేతుల మీదుగా ఫ్లాట్లు అప్పగిస్తాం
ఆదర్శప్రాయంగా మెగా టౌన్షిప్ నిర్మాణమయ్యేలా పర్యవేక్షించిన ఎమ్మెల్యే కొడాలి
నాని,అధికార యంత్రాంగాన్ని అభినందించిన మంత్రి ఆదిమూలపు సురేష్..
గుడివాడ : రాష్ట్రంలో టిడ్కో లేఅవుట్లలో జరిగిన అభివృద్ధిపై పదేపదే టిడిపి
నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమని, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు
సురేష్ ఛాలెంజ్ చేశారు. టిడిపి హయాంలో నామమాత్రంగా నిర్మించి ప్రారంభించిన
ఫ్లాట్లలో, ఒకరైన నివాసం ఉంటున్నారా అని మంత్రి సురేష్ ప్రశ్నించారు. గుడివాడ
మల్లాయిపాలెం లేఅవుట్ టిడ్కో ఫ్లాట్లలో జరిగిన అభివృద్ధి పనులను కలెక్టర్
రాజబాబుతో కలిసి మంత్రి సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లే అవుట్ లో జరిగిన
అభివృద్ధిని అధికారులు మంత్రి సురేష్ కు వివరించారు. టిడ్కో నిర్మాణాలపై
టిడిపి నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేష్
మండిపడ్డారు. టిడిపి హయంలో నామమాత్రంగా నిర్మించిన ఫ్లాట్లలో మనిషి
నివసించేందుకు కనీస వసతులు కూడా లేవని ఆయన గుర్తు చేశారు. వైసిపి హయాంలో
టిడ్కో లబ్ధిదారులకు 400 కోట్ల రాయతీలతో పాటుగా, 14 వేల కోట్ల అదనపు ఖర్చుతో
అభివృద్ధి పనులను పూర్తి చేశామని మంత్రి సురేష్ తెలిపారు. టిడిపి నేతలు
అబద్ధాలతో చెబుతూన్న ఫ్లాట్లకు, జగన్ హయంలో నిర్మించి ఇస్తున్న ఇళ్లకు అసలు
పోలికే లేదని ఆయన స్పష్టం చేశారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి సురేష్ అన్నారు.పూర్తిస్థాయి
మౌలిక వసతులతో 50వేల టిడ్కో ప్లాట్లను నూరు శాతం పూర్తి చేశామన్నారు.
ఆదర్శవంతంగా గుడివాడలో మెగా టౌన్షిప్ నిర్మాణమయ్యేలా పరిరక్షించిన ఎమ్మెల్యే
కొడాలి నాని, అధికార యంత్రాంగాన్ని మంత్రి సురేష్ అభినందించారు. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో గుడివాడలోని లబ్ధిదారులకు ఫ్లాట్లను
అప్పగిస్తామని ఈ సందర్భంగా సురేష్ అన్నారు. మంత్రి పర్యటనలో వైఎస్ఆర్సిపి
రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను,
సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు, పాలెటి చంటి,టిడ్కో కార్పొరేషన్
డైరెక్టర్లు, మున్సిపల్, రెవిన్యూ, హౌసింగ్, విద్యుత్ తదితర శాఖల అధికారులు,
వైసిపి నేతలు పాల్గొన్నారు.