రష్యా : వ్లాడిస్లావా గలగన్.. రష్యాకు చెందిన ఓ మహిళా బాడీ బిల్డర్. ఆమె
చూడటానికి అచ్చం అమెరికన్ మోడల్ కెండల్ జెన్నర్లా ఉంటారు. అందుకే అంతా
‘కెండల్ జెన్నర్ ఆన్ స్టెరాయిడ్స్’ అని పేరు పెట్టేశారు. ఈ బాడీ
బిల్డర్‌కు కేవలం కండలే కాదు..అందం కూడా ఎక్కువ. ఆ అందానికి ఫిదా అయ్యే
ఫేస్బుక్, ఇన్‌స్టా, ఓన్లీ ఫ్యాన్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షలాది
మంది ఆమెను అనుసరిస్తున్నారు. వ్లాడిస్లావా రష్యాలోని టెమ్రియుక్లో
జన్మించారు. 16 ఏళ్ల వయసులో జిమ్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఇప్పుడు ఆమె వయసు
27 సంవత్సరాలు. నిత్యం వ్యాయామాలపై దృష్టి సారిస్తూ తన పలకల దేహాన్ని
తీర్చిదిద్దుకున్నారు. వారంలో కనీసం ఆరురోజులు తప్పకుండా జిమ్‌కు వెళ్తారు.
రోజుకు నాలుగు సార్లు ఆహారం తీసుకుంటారు. అందులో ప్రొటీన్లు అధికంగా ఉండే
గొడ్డుమాంసం, గుడ్లు, కోడిమాంసం, చేపలు ఉండేలా చూసుకుంటారు. వ్లాడిస్లావా
ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని ప్రాగ్లో నివసిస్తున్నారు. ఆమె ఫొటోలు,
వీడియోలను ఆన్లైన్లో చూసిన వారంతా నకిలీ మనిషి అని, ఫొటో షాప్ చేశారని
విమర్శిస్తుంటారు. అయితే ఈ రూపం కఠోర శ్రమ, జన్యుపరంగా సంక్రమించిన శక్తి
వల్లే సాధ్యమైందని గలగన్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.