ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్
కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించిన ఈ పదవిలో ఆయన 3 ఏళ్లపాటు కొనసాగనున్నారు.
సోమేశ్‌కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో
అనంతపురం కలెక్టర్ సహా వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత
ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు.

కొంతకాలం ఆయన గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా, 2016 లో ఆబ్కారీ శాఖ
ముఖ్యకార్యదర్శిగా కూడా పనిచేశారు. తరవాత రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2019 లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా
నియమితులయ్యారు. సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్ అధికారిగా పేర్కొంటూ ఈ ఏడాది
జనవరిలో హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తరవాత డీవోపీటీ ఆయనను ఏపీకి బదిలీ
చేసింది. తదనంతర పరిణామాల్లో సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ
తీసుకున్నారు.