కొవ్వూరు : రాష్ట్రంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా సంక్షేమ పథకాలను
ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రతి ఇంటికి కనీసం లక్ష నుండి పది లక్షల వరకు
ఆర్థిక లబ్ధి చేకూరుతుందని హోంమంత్రి, ప్రకృతి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి
డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు పట్టణంలోని ఔరంగాబాద్ లో బాబు
జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత
మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఈ ప్రభుత్వం
పనిచేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానన్ని సంక్షేమ పథకాలు మన
రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం ఎంత?, ఈ
ప్రభుత్వంలో చేసిన సంక్షేమం ఎంత.? వారు చేసిన అభివృద్ధి ఏంటి..? మేం చేసిన
అభివృద్ధి ఏంటి అని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి చెప్పగలుగుతున్నామని తెలిపారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి అందించలేనంత సంక్షేమం ఈ రోజున వై.యస్. జగన్ మోహన్ రెడ్డి
అందించారన్నారు. గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ బడ్జెట్ దాదాపు సమానంగా
ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారని హోంమంత్రి
ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి
అందుతున్న సంక్షేమాన్ని లెక్కలతో సహా కుటుంబ సభ్యులకు ఆమె వివరించారు. ప్రజల
సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని, అన్ని శాఖల
అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు.