చలివేంద్రాన్ని ప్రారంభించిన నగర మేయర్ గొలగాని
విశాఖపట్నం : వేసవికాలం దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తిని తీర్చడానికి
వివిధ సంస్థలకు, ఎన్జీవోలకు, స్థానిక సేవా సంఘాలు స్వచ్ఛందంగా చలివేంద్రాలని
ఏర్పాటు చేయాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. తూర్పు
నియోజకవర్గం కిన్నెర కామేశ్వరి థియేటర్ నందు జననేత పత్రిక సంపాదకులు దాసరి శివ
కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని నగర మేయర్ గొలగాని హరి
వెంకట కుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ
సామాజిక సేవలో భాగంగా వేసవి మండు టెండలో దాహార్తిని తీర్చే కార్యక్రమానికి
శ్రీకారం చుట్టిన జననేత పత్రిక సంపాదకులు దాసరి శివకుమార్ ని అభినందించారు. ఈ
చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని విపరీత వేసవి కాల వేడిమిలో
అందరూ అనారోగ్య బారిన పడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లు,
బాటసారులకు, ప్రయాణికులకు, దప్పిక తీర్చిన వాళ్ళవుతారన్నారు. అనంతరం అక్కడికి
విచ్చేసిన వారికి మజ్జిగను పంపిణీ చేశారు.