టోల్ ఫ్రీ నెంబర్-1902కు కాల్ చేస్తే పరిష్కారం
వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి శ్రీకారం
చుట్టాం
క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
అమరావతి : సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత
గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’
కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీకారం
చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా
ప్రారంభించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్
ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఇది
మంచి వేదిక అవుతుందని, ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు పరిష్కారం
అన్నారు. ప్రజలకు సేవ అందించేందుకే నేను ఈ స్థానంలో ఉన్నాను. ఫిర్యాదు నమోదు
చేసిన వెంటనే వైఎస్సార్ ఐటీ కేటాయింపు. ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా
ఫిర్యాదు స్టేటస్. ప్రత్యక్షంగా సీఎం కార్యాలయం పర్యవేక్షణ ఉంటుందని,
అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు.
లంచాలకు, వివక్షకు తావు లేకుండా పథకాల అమలవుతాయని, స్పందన ద్వారా ప్రజల నుంచి
ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక
వ్యవస్థను ఏర్పాటు చేశా మని, పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని,
ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టామని, ప్రతి సమస్యకు
పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో
లంచాలు, వివక్ష ఉండేదని, ప్రతీ మంచి పనికి కూడా మాకు ఎంతిస్తారనే గుణం
టీడీపీదన్నారు. టీడీపీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని, తమ
పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చే వారన్నారు. తన
పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనింఛానని, పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు
అందాలన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు ‘జగనన్నకు చెబుదాం’
కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
వెల్లడించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు ఆహ్వానం : జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాలతో పాటు గ్రామ సచివాలయాలు /
రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జడ్పీ
సీఈవోలు, డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక
జడ్పీటీసీకి ఈ సమాచారాన్ని అందచేయడంతోపాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
ఆహ్వానించాలని పేర్కొంది. గ్రామ సచివాలయాల్లో నిర్వహించే కార్యక్రమానికి
స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను ఆహ్వానించాలని సూచించింది.