పవన్ కల్యాణ్ ఒక పనికిమాలిన వాడు అయితే స్థానిక జనసేన నాయకుడు ఒక పెద్ద వెధవ –
వెలంపల్లి
పశ్చిమ ప్రజలారా జనసేన వాళ్ళు వస్తున్నారు జరా భద్రం : వెలంపల్లి
ఉదయం ఇంటి ఇంటికి అని వస్తారు రాత్రికి కబ్జా చేయడానికి వస్తారు : వెలంపల్లి
విజయవాడ : స్థానిక భవానిపురం లో గల 39, 40, 42, 43,44 డివిజన్ల పరిధిలో గల ఆర్
టి సి వర్కషాప్ రోడ్ ను 3 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన రోడ్డు
ప్రారంభోత్సవం , 46.98లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సైడు కాలువల నిర్మాణ
పనుకులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పశ్చిమ
నియోజకవర్గ శాసన సభ్యలు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిధిగా పాల్గొని
రోడ్డును ప్రారభించి కాలువలకు శంఖుస్థాపన చేసారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ
రోడ్ కి శంకుస్థాపన మేమె చేసాం ప్రారంభం కూడా మేమే చేశామన్నారు.నియోజకవర్గంలో
100 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామన్నారు. అభివృద్దే లక్ష్యంగా పని
చేస్తున్నామన్నారు.రోడ్లను అందగా రూపుదిద్దుతున్నామన్నారు. పార్కులు కూడా
అభివృద్ది చేస్తున్నామన్నారు.గతంలో చంద్రబాబు హయాంలో అవినీతి కి అక్రమాలకు
లంచాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారన్నారు.గతంలో నియోజకవర్గ అభివృద్ది శున్యం అని
అన్నారు.మా హయాంలో నే సితార సెంటర్ వద్ద గల గ్రౌండ్ ను కూడా అత్యంత అద్భుతంగా
నిర్మించబోతున్నమన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు
వస్తారు అని ప్రశ్నించారు.తెలంగాణ లో కూర్చొని ఏపీ ప్రజలకు ఏమి న్యాయం
చేస్తారు అని ప్రశ్నించారు.ఆయనేమో ప్యాకేజ్ కోసం పని చేస్తాడు స్థానిక నాయకుడు
యమో కబ్జాల చెయ్యడానికి పని చేస్తాడు అని దుయ్యబట్టారు. స్థానిక నాయకుడు ఇంటి
ఇంటికి అని తిరుగుతున్నాడని, పశ్చిమ ప్రజలు తమ ఆస్తులు జాగ్రత్త గా
ఉంచుకోవాలని లేకపోతే ఆయన కబ్జాలు చేస్తాడని తెలిపారు.ఉదయం ఏదో రెండు సందులు
తిరిగి లేనివి వున్నట్టు సృష్టించు మాట్లాడటం సబబు కాదన్నారు. పవన్ కళ్యాణ్ ఒక
పనికిమాలిన వాడు అయితే స్థానిక నాయకుడు ఒక పెద్ద వెధవ అని అన్నారు.కేవలం
కబ్జాలు చేసి జనలను మోసం చేయడం కోసమే ఆయన తిరుగుతున్నాడని ప్రజలు భద్రంగా
ఉండాలని పిలుపునిచ్చారు.గతంలో ప్రశ్నించని వ్యక్తి ఇప్పుడు ఎందుకు
ప్రశ్నిస్తున్నాడని అన్నారు. గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి
వున్నప్పుడు అభివృద్ది చేసుంటే మేము అభివృద్ది చేయాల్సిన పని ఉండేది కాదు కదా
అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు
గుడివాడ నరేంద్ర, తయరడ్ల అంజనేయ రెడ్డి, ఇర్ఫాన్, మైలవరపు
దుర్గారావు,మైలవరపు కృష్ణ,దుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, జిల్లా వక్ఫ్
బోర్డ్ అధ్యక్షులు గౌస్ మొహిద్దిన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరక్టర్లు,
పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, నగర
పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.