విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో
కోల్ కతా 5 వికెట్ల తేడాతో నెగ్గింది.
దూకుడుగా ఆడిన ఆండ్రీ రసెల్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో
విరుచుకుపడ్డాడు. శామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రసెల్ మూడు సిక్సులు
బాదాడు. దాంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
ఒక్కసారిగా రన్ రేట్ తగ్గడంతో, చివరి ఓవర్లో కోల్ కతా విజయానికి 6 పరుగులు
అవసరం అయ్యాయి. ఆ ఓవర్లో రసెల్ అవుట్ కాగా, చివరి బంతికి 2 పరుగులు అవసరం
అయ్యాయి. ఆర్షదీప్ సింగ్ వేసిన ఆ బంతికి రింకూ సింగ్ ఫోర్ కొట్టడంతో కోల్ కతా
జయభేరి మోగించింది. 180 పరుగుల విజయలక్ష్యాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ 20
ఓవర్లలో 5 వికెట్లకు ఛేదించింది.
రింకూ సింగ్ 10 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ 23 బంతుల్లో 3
ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అంతకుముందు, కోల్ కతా ఇన్నింగ్స్ లో కెప్టెన్ నితీశ్ రానా 51, ఓపెనర్ జాసన్
రాయ్ 31 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రాహుల్ చహర్ 2, నాథన్
ఎల్లిస్ 1, హర్ ప్రీత్ బ్రార్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో కోల్ కతా నైట్
రైడర్స్ పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి ఎగబాకడం విశేషం. పంజాబ్ కింగ్స్ ఏడో
స్థానంలో ఉందిఆండ్రీ రసెల్ చాన్నాళ్ల తర్వాత తన ప్రదర్శన చేసిన వేళ, కోల్ కతా
నైట్ రైడర్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన
మ్యాచ్ లో కోల్ కతా 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

స్థానంలో ఉంది