మణిరత్నం దర్శకత్వంలో .. చారిత్రక నేపథ్యంలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమా
రూపొందింది. చోళ .. పాండ్య రాజుల మధ్య జరిగే యుద్ధాలతో ఈ కథ నడుస్తుంది.
ఎంజీఆర్ ఈ కథను తెరపైకి తీసుకుని రావడానికి చాలా ప్రయత్నం చేశారు .. కానీ
కుదరలేదు. మణిరత్నం అతికష్టం మీద ఆ కథకి దృశ్య రూపాన్ని ఇవ్వగలిగారు.

లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ పార్టుకి ఒక్క తమిళనాడులో
మాత్రమే మంచి ఆదరణ లభించింది. రెండవ పార్టుకి మాత్రం ఇతర భాషల్లోను ఆదరణ
లభిస్తోంది. ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఇంతవరకూ 300 కోట్ల గ్రాస్
ను రాబట్టింది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ, అందుకు
సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
ఈ మధ్య కాలంలో ఇంతమంది స్టార్ హీరోలు .. హీరోయిన్స్ కలిసి నటించిన సినిమా
ఇదేనని చెప్పాలి. మణిరత్నం ఈ సినిమాలో పాటలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. కానీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఏఆర్ రెహ్మాన్ మాత్రం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్
కి తీసుకుని వెళ్లాడు.