సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
హైదరాబాద్ : నిరాశలో ఉన్న తెలంగాణ యువతకు భరోసా ఇచ్చేందుకే సోమవారం రోజున
హైదరాబాద్లో కాంగ్రెస్ భరోసా సభ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి
విక్రమార్క తెలిపారు. సభలో ఆ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ యూత్
డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఆయన చేస్తున్న
పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అబ్దుల్లాపూర్మెట్
మండలం పెద్ద అంబర్పేట్ కూడలి వద్ద ఆయన ప్రసంగించారు.