విజయవాడ : అకాల వర్షాలకు మొక్కజొన్న పసుపు పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం
ఆదుకుంటుందని, ఎవరు ఆందోళన చెందవద్దని విపత్తుల నిర్వహణ, గృహ నిర్మాణం,
జగనన్నకు చెబుదాం కార్యక్రమాల పరిశీలనకు కృష్ణా జిల్లాకు ప్రభుత్వం నియమించిన
ప్రత్యేక అధికారి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి లక్ష్మీ శా భరోసా ఇచ్చారు.
ఆదివారం కంకిపాడు పెనమలూరు మండలాల్లో ప్రత్యేక అధికారి పర్యటించి దెబ్బతిన్న
మొక్కజొన్న పసుపు పంటలు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి
తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించారు.
కంకిపాడు మండలం కంకిపాడు, కోలవెన్ను, పెనమలూరు మండలం తాడిగడప, పెదపులిపాక
ప్రాంతాల్లో ప్రత్యేక అధికారి పర్యటించారు. దెబ్బతిన్న మొక్కజొన్న, పసుపు, వరి
పంటలు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు మొక్కజొన్న లో ఫంగస్ నివారణకు ఉప్పు
ద్రావణం చల్లే కార్యక్రమంలో ప్రత్యేక అధికారి స్వయంగా పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు
మొక్కజొన్న, పసుపు, అరటి వంటి పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. వ్యవసాయ
అనుబంధ శాఖల అధికారుల అప్రమత్తంగా ఉంటూ పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం
ఆదుకునే విధంగా రైతు వివరాలు నష్టపోయిన పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలని
పంట నష్టం వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు.
రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. పంట నష్ట పోయిన
ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అర్హత మేరకు పంట నష్టం
అందించేందుకు కృషి చేస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక అధికారి
వెంట ఉన్నారు.