బిజెపి నాయకులు రైతుల పొలాల్లో అడుగు పెట్టాలి
తడిసిన ధాన్యాన్ని కొనకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతుంది
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి
నష్టపోయిన పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఆదివారం పరిశీలించారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో దెబ్బతిన్న నువ్వుల
పంట,టమాటా, వరి పంటలను పరిశీలించి బాధిత రైతు సంతోష్ కు మనో ధైర్యం చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతుకు కేసిఆర్ ప్రభుత్వం అండగా
ఉంటుందని రైతులకు మంత్రి భరోసా కల్పించారు. కెసిఆర్ ఉండగా అన్నదాతలకు ఎలాంటి
ఇబ్బందులు రానివ్వడని,నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ఎకరాకు 10వేల సహాయంతో రైతులకు అండగా నిలుస్తున్నరని
గుర్తు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం
కొర్రీలు పెడుతుందని కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. రైతుల
ధాన్యాన్ని తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఎఫ్సీఐ రాష్ట్ర
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వెకిలి చేష్టలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం
చేశారు. రంగుమారిన ధాన్యం కొనమని చెప్తూ.. రైతుల వద్దకు వెళ్లి రాష్ట్ర
ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొనకుండా
అడ్డుకునేది వారే..రైతులను రెచ్చ గొట్టేది వారేనని బీజేపీ తీరుపై నిప్పులు
చెరిగారు. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు
కేంద్రాలు లేవని అన్నారు. రైతు పక్షపాతి అయిన కేసిఆర్..పండిన పంటను
అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకూడదని ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు
కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్,ఇతర బీజేపీ
పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్,మధ్య ప్రదేశ్,మొన్నటి వరకు ఉన్న కర్ణాటకలో
గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రైతులకు 24గంటల
ఉచిత విద్యుత్,సాగునీరు,పంట పెట్టుబడి సాయం,రైతు భీమా లతో కేసిఆర్ ప్రభుత్వం
భరోసాగా నిలిస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతులతో దుర్మార్గంగా రాజకీయాలు
చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ద్వందవైఖరి పట్ల రైతులు ఆలోచన చేయాలని
కోరారు. నష్టపోయిన పంటలకు కేసీఆర్ ఎకరానికి 10వేల ఇచ్చినట్లు కేంద్రం కూడా
10వేలు ప్రకటించాలని మంత్రి వేముల సవాల్ చేశారు. రైతులకు ఎకరానికి 10వేల పంట
నష్ట సహాయం ప్రధాని మోడీ చేత ప్రకటించిన తర్వాతే బిజెపి నాయకులు రైతుల
పొలాల్లో అడుగు పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. అనంతరం మోర్తాడ్ మండలంలో పలు
అభివృద్ది పనుల శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దోన్కల్ గ్రామంలో NH 16 నుండి NH 7 (వయా దోన్కల్,రేంజర్ల) వరకు 4.47 కోట్లతో
బిటి రోడ్డు పునరుద్ధరణ శంకుస్థాపన,దోన్కల్ నుండి పోచంపల్లి వరకు వయా వడ్డెర
కాలనీ 90 లక్షలతో రోడ్ మరమ్మతులు పనుల శంకుస్థాపన,ధర్మోరా గ్రామంలో NH 16
నుండి NH 7 (వయా దోన్కల్,రేంజర్ల) వరకు 4.47 కోట్లతో బిటి రోడ్డు పునరుద్ధరణ
శంకుస్థాపన,NH 16 నుండి NH 7 (వయా దోన్కల్,రేంజర్ల) వరకు 4.47 కోట్లతో బిటి
రోడ్డు పునరుద్ధరణ శంకుస్థాపన,
షేట్పల్లి నుండి వన్నెల్ బి క్రాస్ రోడ్ వరకు 3.95 కోట్లతో నూతన బిటి రోడ్
పనుల శంకుస్థాపన,ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామంలో NH 16 నుండి NH 7 (వయా
దోన్కల్,రేంజర్ల) వరకు 4.47 కోట్లతో బిటి రోడ్డు పునరుద్ధరణ శంకుస్థాపన
కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసిఆర్
సహకారంతో అభివృద్ది పరంపర కొనసాగుతుందని చెప్పారు. వందల కోట్లతో రోడ్లు
నిర్మించుకున్నమని,మౌళిక సదుపాయాల ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పసుపు
బోర్డు పేరుతో మోసం చేసిన బీజేపీ పార్టీ వారు మాటలు చెప్పుడు తప్పా అభివృద్ది
చేసింది ఏమి లేదని ఎద్దేవా చేసారు. గ్రామాల్లో తిరుగుతూ అసత్యాలు ప్రచారం
చేస్తున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంచి చేస్తున్నది
ఎవరు..మాటలు చెప్పి ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నది ఎవరో ప్రజలు ఆలోచన
చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,
అధికారులు పాల్గొన్నారు.