మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అంగీకారంతో రాష్ట్రంలో సంగీత
పాఠశాలతో పాటు మ్యూజిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్
ప్రకటించారు. పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ విద్యే కాకుండా సంగీతం
ప్రాధాన్యంగా ఉండాలన్న కేటీఆర్ ఈ మేరకు రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్సిటీని
ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న
మ్యూజిక్ స్కూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇళయరాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు.