నాగచైతన్య తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘కస్టడీ’ రెడీ
అవుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం
వహించాడు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన తెలుగు
.. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతూ
బిజీగా ఉన్నాడు.
తాజాగా చైతూ మాట్లాడుతూ .. ‘కస్టడీ’ సినిమా కథ నాకు కరెక్టుగా సరిపోతుంది
.. అందువలన నేను చేశాను. ఒకవేళ ఏ కథైనా అఖిల్ కి బాగుంటుందని అనుకుంటే, ఆయన
దగ్గరికి పంపిస్తాను. నాకు ఫలానా డైరెక్టర్ తో సినిమా చేయాలనుందని నాన్నతో
చెబితే, ప్రాజెక్టు సెట్ చేయడానికి ఎంతో సమయం పట్టదు. కానీ నా అంతట నేనుగా
ఎదగాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాను” అని అన్నాడు.

ఇక పరశురామ్ తో ప్రాజెక్టు గురించిన ప్రస్తావన రాగానే, “ఆయన గురించి మాట్లాడటం
టైమ్ వేస్టు. నా టైమ్ ఆయన చాలా వేస్టు చేశాడు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం
వలన మీ టైమ్ .. నా టైమ్ వేస్టు అవుతుంది” అంటూ ఆ తరువాత మాట్లాడటానికి కూడా
ఇష్టపడలేదు. మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమా కోసం, చైతూ ప్రాజెక్టును
వదిలేసి పరశురామ్ వెళ్లాడనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.