అమరావతి : ఆర్-5 జోన్‌పై రైతులు సుప్రీంకోర్టులో వేయనున్న స్పెషల్ లీవ్
పిటిషన్లో జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్
ఇంప్లిడ్ అవనున్నారు. సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా జడ శ్రావణ్ వాదలను
వినిపించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ల్యాండ్ పులింగ్ ద్వారా
ప్రభుత్వానికి భూ బదలాయింపు జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి యాజమాన్యం హక్కులు
పొందవని అభిప్రాయపడ్డారు. రైతులు వేసిన పిటిషన్ హైకోర్టుకొట్టేయడం అత్యంత
దురదృష్టకరమన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడటానికి తమ పార్టీ నిర్ణయం
తీసుకుందని తెలిపారు. ఆర్-5జోన్లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇస్తే
రాజధాని ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన
అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడటం
రాజ్యాంగ విధి అని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న బడుగుబలహీన,
మైనార్టీ వర్గాల కోసం తమ పార్టీ సుప్రీంకోర్టులో అమరావతి రైతులు తరఫున పోరాటం
చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూములు ఇచ్చిన
రైతులను దగాకోరులంటూ, కబ్జాకోరులంటూ అవమానించటం ముఖ్యమంత్రికి, మంత్రులకు,
ప్రజాప్రతినిధులకు తగదని హితవుపలికారు. ఈ న్యాయ పోరాటంలో అమరావతి రైతులు
కచ్చితంగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు చేసే
ధర్మ పోరాటంలో విజయం వారిదేనని, రైతులందరూ భరోసాగా ఉండాలని జడ శ్రవణ్ కుమార్
పేర్కొన్నారు.