విజయవాడ, సూర్య బ్యూరో ప్రతినిధి : ఆర్టీఐ చట్టం నాడు నేడు అనే అంశంపై
సదస్సును జై భీం భారత్ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా జై భీమ్ భారత్
పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మాట్లాడారు. అంబానీ అయినా, అతి పేదవాడైనా
ఏం కొన్నా చెల్లించే పన్ను ఒక్కటేనన్నారు. ఏ ప్రభుత్వం అయినా సామాన్యుడు నుండి
వసూలు చేసిన డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో అతనికి తెలుసుకునే హక్కు ఉందని
తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ఖర్చులన్ని ఎప్పటికప్పడు వెబ్సైట్లో
పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. జీవోలను ప్రభుత్వం ఎందుకు సీక్రెట్‌గా
ఉంచుతోందని ప్రశ్నించారు. సీఎం ఢిల్లీ వెళ్లే ఫ్లైట్ ఖర్చులు ఏంటో చెప్పమంటే
భద్రతా కారణాలతో ఇవ్వలేమన్నారని తెలిపారు. చాలా అంశాల్లో సమాచారం ఇవ్వమని
అడిగితే అడిగిన వారిపై కేసులు కట్టమని ఆశాఖ కమీషనర్ కలెక్టర్, ఎస్పీలకు
ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. కలెక్టర్, ఎస్పీలు ప్రభుత్వ పెద్దల చెప్పిన
పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీఐ కింద అడిగితే దాడులు చేస్తున్నారని
ఆరోపిచారు. ఆర్టీఐ యాక్టివిస్టులకు వేధింపులు ఉంటే గన్మ్యాన్లను సైతం
ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వ జీవోనే ఉందన్నారు. ఆర్టీఐ యాక్ట్ కొనపూపిరితో
కొట్టిమిట్టాడుతోందని, కాపాడుకోవాల్సిన భాద్యత మనకు ఉందన్నారు. రైట్ టూ
ఇన్పర్మెషన్ యాక్ట్ కమీషనర్ నియామకం కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని
ఆయన మండిపడ్డారు. ఏపీలో రైట్ టూ ఇన్ఫర్మెషన్ కమీషనర్, సభ్యులు కూడా వైసీపీకి
అనుబధంగానే పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.