మన్యం జిల్లా మొదటి స్థానం సాధించినట్లు జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్
తెలిపారు. శనివారం విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ పదవతరగతి పరీక్షా
ఫలితాలను విడుదల చేసారు. జిల్లా నుండి 5255 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా
4518 మంది, బాలికలు 5434 మంది హాజరుకాగా 4832 మంది ఉత్తీర్ణులైనారు. బాలుగు
ఉత్తీర్ణత శాతం 85.98, బాలికలు ఉత్తీర్ణత శాతం 88.92 వెరశి జిల్లా ఉత్తీర్ణత
శాతం 87.47 సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టరు
శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఫలితాలుసాధించి,రాష్టంలో మొదటి స్థానం
సాధించుటలో పాటుపడిన ఉపాద్యాయులు, అధికారులను జిల్లా కలెక్టరు అభినందించారు.
పరీక్షలలో తప్పిన విద్యార్థులు నిరాశకు గురికాకుండా సప్లమెంటరీ పరీక్షలకు
సిద్దంకావాలని తెలిపారు. జిల్లాలో 7865 మంది విద్యార్థులు ప్రధమ శ్రేణి లో,
1151 మంది విద్యార్థులు ద్వితీయ శ్రేణి లో, 334 మంది విద్యార్థులు తృతీయ
శ్రేణి లో మంది పాస్ అయినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్
కుమార్ తెలిపారు. పార్వతీపురం జిల్లా లో గవర్నమెంట్ యాజమాన్య లో గవర్నమెంటు
హైస్కూలు, పాలకొండలో చదివిన విద్యార్థినులు హేమలత పాడి 587 మార్కులతో ప్రధమ
స్థానం, దుద్ది తబిత 586 మార్కులతోరెండవస్థానం సాధించారని, కురుపాం మోడల్
స్కూల్ విద్యార్థిని కర్రీ తనుశ్రి, సాలూరు MJB రెసిడెన్షియల్ స్కూల్
విద్యార్థిని కర్రీ షర్మిల 585 మార్కులతో మూడవస్థానం సాధించారని తెలిపారు.
మరియు జిల్లాలో 57 పాఠశాలల నందు నూరుశాతం పాస్ పర్సంటేజ్ సాధించిడం
జరిగిందని, 1338 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, మొత్తం మీద 10,714 మంది
విద్యార్ధులు పరీక్ష రాసారని, 25 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని, ఒకరు
విత్ హెల్డ్ అయ్యారని తెలిపారు.
సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చెందిన 72 మంది విద్యార్థులు, బీసీ సంక్షేమ
హాస్టళ్లకు చెందిన 113 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో వరుసగా 61
మంది (84.72 శాతం), 106 మంది (93.86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2,273 మంది
గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష వ్రాయగా 2,134 మంది
(93.88 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 54 పాఠశాలల్లో 24 గిరిజన సంక్షేమ ఆశ్రమ
పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 1853
మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో, 236 మంది విద్యార్థులు ద్వితీయ శ్రేణి, 45
మంది తృతీయ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. దోనుబాయి ఆశ్రమ పాఠశాలకు చెందిన పాలక
గురునాథ్ 571 మార్కులు సాధించి విద్యార్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన
సీతంపేట మండలం కుసుమ గ్రామానికి చెందినవారు. ఆయన తండ్రి ఉమా మహేశ్వరరావు
వ్యవసాయ కూలీ.