బీహార్లో ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షలో ఒక అబ్బాయి ప్రేమ లేఖ రాశాడని భావించిన బాలిక పెద్దలకు చెప్పడం..మరుసటి రోజు ఆ బాలుడు హత్యకు గురికావడం జరిగాయి. తీరా చూస్తే అది ప్రేమలేఖ కాదు… పరీక్షలో జరిగిన చీటింగ్ అని తేలింది. ప్రస్తుతం ఈవివాదం చర్చనీయాంశంగా మారింది.
కేవలం చీటీని ప్రేమలేఖగా భావించి తమ అబ్బాయిని ఓ అమ్మాయి కుటుంబం చంపిందని హతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక మిడిల్ స్కూల్లో అర్ధ వార్షిక పరీక్షల సందర్భంగా అక్టోబర్ 13న ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఉద్వాంత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయా కుమార్ అనే 12 ఏళ్ల బాలుడు 6వ తరగతి చదువుతున్నతన బంధువుతో కలిసి పరీక్ష రాసేందుకు కేంద్రానికి వచ్చాడు. పరీక్ష సమయంలో, అతను తన బంధువు డెస్క్ వైపు కాపీకి సంబంధించిన ఒక చీటీ విసిరి బాలికకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు.
అయితే అబ్బాయి తన వైపు ప్రేమలేఖ విసిరాడని భావించిన మరో బాలిక ఇంటికి వచ్చాక తన సోదరులకు జరిగిన సంఘటన గురించి చెప్పింది. దీంతో బాలిక సోదరులు ఆగ్రహంతో ఊగిపోయి 12 ఏళ్ల బాలుడిని దారుణంగా దాడి చేసి.. కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అయితే మరుసటి రోజు అక్టోబర్ 17వ తేదీ సోమవారం బాలుడి మృతదేహాన్ని రైల్వే ట్రాక్ సమీపంలో కనుగొన్నారు. బాలిక కుటుంబ సభ్యులే బాలుడిని నరికి చంపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది సభ్యులను అరెస్టు చేశారు. వారిలో నలుగురు మైనర్లు ఉండటంతో వారిని జువైనల్ హోంకు, మిగతా వారిని జైలుకు తరలించారు.
మమూలం : సీ ద పీపుల్