గోవర్ధన రెడ్డి
నెల్లూరు : గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం కేవలం మొక్కుబడిగా కాకుండా
నమోదైన ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన
రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం లోని
కృష్ణపట్నం గ్రామంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
కాకాణికి గ్రామ యువత బ్రహ్మరధం పట్టారు. గ్రామం లోని ఇంటింటికి తిరుగుతూ
ప్రజల యోగక్షేమాల్ని విచారిస్తూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ లబ్దికి
సంబంధించిన పత్రాలను అందిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో
మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మాట తప్పని ప్రభుత్వమని ప్రజల్లో
చెరగని ముద్ర వేసామన్నారు. మత్స్యకారేతర ప్యాకేజి అందించడమే కాకుండా, మినీ
ఫిష్ హార్బర్ అందుబాటులో లేనందున ముఖ్యమంత్రి చేతుల మీదుగా జెట్టి
నిర్మాణానికి శంకుస్థాపన చేసామన్నారు. ప్రతి సమస్య కు పరిష్కారం చూపుతూ
నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామన్నారు.
కృష్ణపట్నం పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు
మెరుగయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం, అభివృద్ధి కలగలిపి ప్రజలకు
అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోచర్ల వజ్రమ్మ, యం పి పి సుగుణమ్మ,
మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు
పాల్గొన్నారు.