500 కోట్ల రూపాయల వ్యయంతో చేపల రేవు
*కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజబాబు
*మచిలీపట్నం : జిల్లాలో పరిశ్రమలు పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు ఔత్సాహిక
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు
అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్
హాల్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి
అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో బందరు ఓడరేవు, 500 కోట్ల రూపాయల వ్యయంతో
చేపల రేవు రాబోతున్నాయన్నారు. విశాఖ చెన్నై పారిశ్రామిక నడవ (వీసీఐసీ)కూడా
రాబోతోందని వివరించారు. వీటికి అనుబంధంగా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు తదితర
సూక్ష్మ చిన్న మధ్య భారీ తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు మంచి
అవకాశాలు ఉన్నాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు విరివిగా
నెలకొల్పేందుకు వీలుగా అనుకూల వాతావరణాన్ని జిల్లాలో కల్పించాలన్నారు.
పరిశ్రమలు నెలకొల్పే వారికి త్వరిత గతిన ఆమోదాలు అనుమతులు మంజూరు చేయాలన్నారు.
ముఖ్యంగా స్థలాల కేటాయింపు, విద్యుత్తు, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు
అందించేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు.*
జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు 3677 దరఖాస్తులు అందగా అందులో 3558
దరఖాస్తులు ఆమోదించడం జరిగిందని, 113 దరఖాస్తులు వివిధ కారణాల వలన
తిరస్కరించడం జరిగిందని ఆరు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర కాలుష్య
నియంత్రణ మండలి పరిధిలో ఐదు దరఖాస్తులు, కర్మాగారాల శాఖ పరిధిలో ఒక దరఖాస్తు
ఇంకా పెండింగ్లో ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు
చేపట్టాలన్నారు. ఏపీఐఐసీ పరిధిలో ఎన్ని పరిశ్రమల లేఅవుట్లు ఉన్నాయని, ఎన్ని
పూర్తిస్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించబడినాయనే వివరాలు తెలపాలన్నారు.
అందులో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు ఎంతమందికి ఉపాధి కల్పించారు తదితర
వివరాలను అందజేయాలన్నారు. పరిశ్రమలు నెలకొల్పని వారికి కారణాలు తెలపాలంటూ
నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ కార్యక్రమం
కింద 220 దరఖాస్తులు రాగా 104 లక్ష్యానికి గాను 106 యూనిట్లు మంజూరు చేయడం
జరిగిందని అందులో 74 యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని మిగిలినవి త్వరగా
పూర్తి చేయాలన్నారు. పెట్టుబడి, వడ్డీ, విద్యుత్తు, స్టాంపు డ్యూటీ రాయితీల
కోసం 25 క్లేయిములకు 2,03,10,198 రూపాయలు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మంజూరు
చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎంఎస్సీ మీ డైరెక్టర్ జీ వరలక్ష్మి జిల్లా
పరిశ్రమల అధికారి ఆర్ వెంకట్రావు, డిడి విజయ్ కుమార్, ఏ పి ఐఐ సి జోనల్
మేనేజర్ కె ఎస్ సీతారాం, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీమన్నారాయణ, డిపిఓ
నాగేశ్వర్ నాయక్, విద్యుత్ శాఖ ఇ ఇ భాస్కర్, వాణిజ్య పనుల శాఖ సహాయ కమిషనర్ వి
వెంకటేశ్వరరావు, కర్మాగారాల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పర్యావరణ
సహాయం ఇంజనీర్ జ్యోష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.