హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో మంత్రి కేటీఆర్ వైఫల్యం ఉందని
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సిట్‌పై తమకు నమ్మకం లేదని,
ప్రగతిభవన్ నుంచే దర్యాప్తు కొనసాగుతోందని ఆరోపించారు. పేపర్ల లీకేజీలో ఐటీ
శాఖ వైఫల్యంపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని బేగంబజార్ స్టేషన్లో
ఇన్స్పెక్టర్ శంకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ ‘పేపర్ల లీకేజీలో
మంత్రి కేటీఆర్, ఆయన పీఏ హస్తం ఉంది. రాష్ట్రంలో 80వేల ఉద్యోగాలను భర్తీ
చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పటివరకు 30వేల ఉద్యోగాలకు కూడా
నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే పరీక్షలు
పెడుతున్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న నన్ను మహిళ అని
కూడా చూడకుండా ఒకరోజు జైల్లో నిర్బంధించడం ఎంతవరకు సమంజసం’’ అని ప్రశ్నించారు.