హైదరాబాద్ : బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఆదివారం సరూర్‌నగర్
స్టేడియంలో తెలంగాణ భరోసా సభ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ సభలో పాల్గొనేందుకు
బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి శనివారం సాయంత్రం నగరానికి
చేరుకోనున్నట్లు చెప్పారు. లక్డీకాపూల్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు
చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్
ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణలో భారాస కార్యక్రమాలను బీఎస్పీ
కార్యకర్తలు అడ్డుకుంటారనే అనుమానంతోనే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని,
నిజమైన అభివృద్ధి, ప్రజలకు న్యాయం చేసి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి
కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ముందస్తు అరెస్టులపై
న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.