బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్ : కరీంనగర్లో ఈ నెల 14న లక్ష మందితో హిందూ ఏక్తాయాత్రను భారీ
స్థాయిలో నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ప్రకటించారు. ముఖ్య అతిథిగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ హాజరవుతారని
ఓప్రకటనలో తెలిపారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ సహా
ఇతర నేతలు పాల్గొంటారన్నారు. హిందువుల సంఘటితశక్తిని చాటడమే లక్ష్యంగా ఈ
ఏక్తాయాత్రను 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, హిందూ ధర్మరక్షణకు పాటుపడేవారంతా
రావాలన్నారు.
మరో రెండు రోజులు కర్ణాటక ప్రచారానికి సంజయ్ : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి
సంజయ్ మరో రెండు రోజులపాటు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆది,
సోమవారాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.