పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ
షంషేర్‌గంజ్ : కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలతో 2024 సార్వత్రిక
ఎన్నికల్లో ఓట్లు పడతాయని బీజేపీ భావిస్తున్నట్లుందని, అది జరగదని
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆమె ఓ ప్రభుత్వ కార్యక్రమంలో
మాట్లాడుతూ బీజేపీని ఓడించడానికి విపక్ష పార్టీలు సమైక్యమవ్వాలని
పిలుపునిచ్చారు. ఈడీ, సీబీఐలతో ప్రతిపక్ష పార్టీలను కాషాయ పార్టీ వేధిస్తోందని
ఆరోపించారు. అయితే ఆ సంస్థల కారణంగా బీజేపీకి ఓట్లు పడవన్నారు.