ఐపీఎల్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ అత్యంత సునాయాసంగా గెలిచింది. రాజస్థాన్
రాయల్స్ ను దాని సొంతగడ్డపైనే 9 వికెట్ల తేడాతో ఓడించింది. 119 పరుగుల
లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.
రాయల్స్ ను దాని సొంతగడ్డపైనే 9 వికెట్ల తేడాతో ఓడించింది. 119 పరుగుల
లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.
జైపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్
ఎంచుకుంది. అయితే గుజరాత్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో 118
పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ కేవలం 1
వికెట్ నష్టానికి 13.5 ఓవర్లలో ఛేదించింది.
ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 41, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 39 పరుగులతో అజేయంగా
నిలిచారు. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. ఛేజింగ్ లో
గుజరాత్ పై రాజస్థాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రాజస్థాన్
బౌలర్లలో చహల్ కు మాత్రం వికెట్ దక్కింది.