ఇండోనేషియాలోని ఉత్తర జకార్తా ఇస్లామిక్ సెంటర్ గ్రాండ్ మసీదులో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మసీదు పెద్ద గోపురం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఇస్లామిక్ సెంటర్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు మంటలు వ్యాపించడంతో ప్రమాదం సంభవించింది. కూలిపోయే ముందు మసీదు గోపురం నుంచి మంటలు, పొగలు వెలువడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ మసీదు జకార్తా ఇస్లామిక్ సెంటర్కు చెందిన భవన సముదాయంలో ఉంది. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని, మసీదును పునరుద్ధరించే పనిలో ఉన్న కాంట్రాక్టు కంపెనీకి చెందిన నలుగురు కార్మికులను విచారించామని పోలీసులు తెలిపారు.
మూలం: ఇండియా టుడే