విజయవాడ :ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో
గురువారం పౌర్ణమి సందర్భముగా ఉదయం లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కొరకు,
ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ
కామధేను అమ్మవారి ఆలయం (ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి,
అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించారు. ఈ
కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు,
కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ
అధికారులు కొబ్బరి కాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. గిరిప్రదక్షిణ
కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయము, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు
స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు
బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా ఆలయమునకు చేరుకున్నారు.
గిరిప్రదక్షిణ మార్గము నందు భక్తులు ప్రచార రథము లో కొలువై ఉన్న శ్రీ
అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయ లు
సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా
నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి
ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. అనంతరం ఆలయ
ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి
సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగినదని,
గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అందరికీ సంతోషంగా ఉన్నదని తెలిపారు. రాబోవు గిరి
ప్రదక్షిణల యందు భక్తులు మరింతగా పాల్గొని శ్రీ అమ్మవారి స్వామివారి కృపకు
పాత్రులు కావలసిందిగా కోరి ఉన్నారు. అనంతరం ఆలయ కార్య నిర్వహణ అధికారి
మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
నిర్వహించడం జరిగినదని, గిరి ప్రదక్షిణ కార్యక్రమం నందు పాల్గొను భక్తులు
ప్రతి నెల విశేషంగా పెరుగుతున్నారని, రాబోవు గిరి ప్రదక్షిణల యందు భక్తులు
మరింతగా పాల్గొని శ్రీ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరి
ఉన్నారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు, కట్టా
సత్తయ్య, కేసరి నాగమణి, బచ్చు మాధవీ కృష్ణ, చింకా శ్రీనివాస రావు, చింతా
సింహాచలం, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక సిబ్బంది, వేద
పండితులు, కార్యనిర్వాహక ఇంజినీర్ కె. వి.ఎస్ కోటేశ్వరరావు, ఇంజినీరింగ్
సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషముగా పాల్గొన్నారు.