రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
*ఫిర్యాదులను నివేదించేందుకు ఓ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి
అధికారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, అనంతర పరిస్థితులపై అధికారులతో సీఎం జగన్
మోహన్ రెడ్డి సమీక్ష
అమరావతి : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, అనంతర పరిస్థితులపై తన కార్యాలయ
అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా పంట
నష్టం తదితర అంశాలపై ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, అనంతర పరిస్థితులపై తన కార్యాలయ అధికారులతో
సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై
ప్రాథమికంగా అందిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జగన్
మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న
మాట రాకూడదని, వారికి పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ఆదేశించారు.
వర్షాలతో రైతులకు కలిగిన పంట సహా ఇతర నష్టాలను గ్రామ సచివాలయాల స్థాయి నుంచే
నిరంతరం వివరాలు తెప్పించుకోవాలని సీఎం సూచించారు. రంగుమారిన, తడిసిన
ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇది పూర్తిస్థాయిలో జరగాలి. ఎన్యుమరేషన్
ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో
సామాజిక తనిఖీ కోసం పెట్టాలి. ఎవరైనా మిగిలిపోయినా వెంటనే అధికారుల దృష్టికి
తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుంది. పంట నష్టపోయిన ఏ రైతుకు కూడా పరిహారం
అందలేదనే మాట రాకూడదు. రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం
చేయాలి. రైతులకు ఎమైనా ఇబ్బందులు, ఫిర్యాదులు ఉంటే వాటిని నివేదించేందుకు ఓ
టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేయాలి. ఈ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు
అధికారులు సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.
వర్షాల కారణంగా తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్ద నుంచి వెంటనే ఈ ధాన్యాన్ని
తీసుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు హార్వెస్టింగ్ చేసి
ఉన్న ధాన్యం ఎక్కడా ఉన్నా వర్షాల బారి నుంచి వాటిని కాపాడ్డానికి చేపడుతున్న
చర్యలను మరింత ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. కొనుగోలు కేంద్రాలు,
ఆర్బీకేలు, రైతుల వద్ద కాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే
అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు.
ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్
ఆదేశించారు.