నరేంద్ర మోడీ
మంగళూరు : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళూరు, ఉడుపి ఉత్తర కన్నడ జిల్లాల్లో
ఎన్నికల ప్రచారసభలలో పాల్గొన్నారు. ఉత్పాదక రంగంలో కర్ణాటకను మొదటి స్థానంలో
నిలిపేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్,
జనతాదళ్లకు అవకాశమిస్తే రివర్స్ గేరులో రాష్ట్రాన్ని తీసుకువెళతారని
వ్యాఖ్యానించారు. గత మూడున్నరేళ్ల కర్ణాటక ప్రభుత్వాన్ని, తమ తొమ్మిదేళ్ల
సాధనలను ఏకరవు పెట్టారు. తన ప్రసంగాలను కన్నడలోనే ప్రారంభించి, హిందీలో
కొనసాగించారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలో పద్మ పురస్కార గ్రహీతలు హాలక్కి
ఒక్కలిగ సముదాయానికి చెందిన తులసీగౌడ, సుక్రి బొమ్మగౌడల ఆశీర్వాదాన్ని
తీసుకున్నారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
నళిన్ కుమార్ కటీల్, మంత్రి శివరాం హెబ్బార్, విధాన సభాధ్యక్షుడు
విశ్వేశ్వర హెగ్డే కాగేరి, ఆయా జిల్లాల నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు
ఈ సభలలో పాల్గొన్నారు.