న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష
పడిన బల్వంత్‌సింగ్ రాజోనాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో రాజోనా
మరణశిక్షను జీవితఖైదుగా మార్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
అతడి క్షమాభిక్ష పిటిషన్‌పై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం
చేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆ పిటిషన్‌పై తగిన సమయంలో నిర్ణయం
తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. సిక్కులకు ప్రత్యేక రాష్ట్రాన్ని
కోరుతూ జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా 1995లో చండీగఢ్ సచివాలయం ముందు జరిగిన
పేలుడులో అప్పటి పంజాబ్ సీఎం బియాంత్‌సింగ్‌తో పాటు మరో 16 మంది మరణించారు. ఈ
పేలుడులో అప్పటికి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్‌సింగ్ రాజోనా
ప్రమేయమున్నట్లు రుజువు కావడంతో 2007లో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష
విధించింది. 26 ఏళ్లుగా అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు
క్షమాభిక్ష ప్రసాదించాలంటూ 2012లో రాజోనా కేంద్రాన్ని ఆశ్రయించాడు. అప్పటి
నుంచి అతడి పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది. ఈ క్రమంలోనే తన మరణశిక్షను
జీవితఖైదుకు తగ్గించాలని 2020లో సుప్రీంకోర్టులో రాజోనా పిటిషన్ దాఖలు
చేశాడు. దీనిపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం కేంద్రానికి పలుమార్లు సూచనలు
చేసింది. తాజాగా మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం శిక్ష తగ్గించబోమని స్పష్టం
చేసింది.