భారతీయుల జాబితాలో ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా నిలిచారు.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ఆయన నియామకాన్ని
ఖరారుచేస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ప్రకటించారు. జూన్
రెండో తేదీ నుంచి ఐదేళ్లపాటు అధ్యక్షునిగా బంగా సేవలందిస్తారని బ్యాంక్ ఒక
ప్రకటనలో తెలిపింది. ఒక భారతీయ అమెరికన్ అధ్యక్షుడు ప్రపంచ బ్యాంక్ పగ్గాలు
చేపట్టడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల బంగాను ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు
బైడెన్ ఈ పదవికి నామినేట్‌చేశారు. బంగా జనరల్ అట్లాంటిక్ సంస్థ
ఉపాధ్యక్షునిగా, మాస్టర్‌కార్డ్ సీఈవోగా చేశారు. కేంద్రం 2016లో ఆయనను
పద్మశ్రీతో సత్కరించింది.
ప్రపంచ బ్యాంక్ కొత్త అధ్యక్షుడిగా అజయ్ బంగా బుధవారం నియమితులయ్యారు.
ప్రపంచబ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు.
ఈ ఏడాది జూన్ 2 నుంచి అయిదేళ్ల పాటు బంగా పదవిలో కొనసాగుతారని ప్రపంచ
బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తుండటం,
అభివృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బంగా ఈ
కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరిలో బంగాను ప్రపంచ బ్యాంక్
అధ్యక్షుడిగా అమెరికా నామినేట్ చేస్తున్నట్లు జో బైడెన్ ప్రకటించిన విషయం
తెలిసిందే. బంగా ఇప్పటివరకు మాస్టర్ కార్డ్, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజ
సంస్థల్లో అత్యున్నత హోదాల్లో పనిచేశారు.