స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేసి ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేయాలి
ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్ ను కలిసిన
గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి మంజుల దేవి
విజయవాడ : స్థానిక విజయవాడ కమిషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి మంజుల దేవి ఆధ్వర్యంలో ఆంధ్ర
ప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్ కు వినతి పత్రం
సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సుల ఎన్నికలు జరుపుటకు ప్రభుత్వం
అనుమతి మంజూరు చేసిందని, రెండు నెలలు గడుస్తున్నా స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్
చేసి ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేయాలని విన్నవించినట్లు తెలిపారు. కొత్తగా
ఏర్పాటు చేసిన రాష్ట్రంలో పలుచోట్ల జి.జి.హెచ్ లలో నర్సులకు 4 నెలలుగా జీతాలు
లేవని, అలాగే పాత ఏ.పీ.వి. వి.పి లలో పనిచేస్తున్న నర్సులకి రెండు నెలలుగా
జీతాలు పెండింగ్ లో ఉండిపోయాయని పేర్కొన్నారు. ఏపీ వివిపి లలో నర్సింగ్
సిబ్బంది 2017 లో బదిలీలు జరిగాయని, అది పురస్కరించుకొని ఇప్పుడు కూడా సాధారణ
బదిలీలు జరపాలని విన్నవించుకున్నామన్నారు. రీజినల్ డైరెక్టర్ కంట్రోల్లో ఉంటూ
సిహెచ్ సిలలో విధులు నిర్వహిస్తున్న హెడ్ నర్సులని స్టాఫ్ నర్సెస్ ని ఏపీ.
వి.వి. పి లో ఆప్షన్ ఇవ్వకుండా ఉన్నారని, వారిని వెంటనే ఆర్డీకి సరెండ్
చేయాలని కోరినట్లు వివరించారు . పూర్తి వివరణతో ఆంధ్ర ప్రదేశ్ ఏపీ .వి.వి.పి
కమిషనర్ కి అందజేయగా వారు పరిశీలించి సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ
కార్యక్రమంలో హెడ్ నర్సెస్ రోజ్ కుమారి, అరుణ, స్టాఫ్ నర్స్ సుమన, రమణ,
స్వర్ణలత , సుధారాణీ, నాగమల్లేశ్వరి, వెంకటేశ్వరమ్మ, జయప్రద, విక్టరియమ్మలు
పాల్గొన్నారు.