కేంద్రాన్ని ప్రారంభించిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బుధవారం
పెనమలూరు మండలం గంగూరులో దనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
కళాశాలలో డ్రోన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం
డ్రోన్స్ టెక్నాలజీ గురించి డ్రోనిక్స్ ఇంజనీరింగ్ ఇజ్రాయిల్ ప్రతినిధులు
గవర్నర్కు వివరించారు. ద్రోన్లలో గల వివిధ భాగాలైన ఫ్లైట్ కంట్రోల్, గ్లోబల్
పొజిషనింగ్ సిస్టం, సెన్సార్లు, కెమెరాస్, వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ,
బ్యాటరీ, ప్రొపల్షన్ సిస్టం మరియు పేలోడ్ డెలివరీ సిస్టం పనితనం గురించి
వివరించారు. ప్రస్తుతం ఏరోస్పేస్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, రిమోట్ సెన్సింగ్,
రెగ్యులేటరీ కంప్లయన్స్ , ఆపరేషన్స్ మేనేజ్మెంట్లలో విరివిగా ఉపయోగిస్తారని
తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు
తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తదితర రంగాల్లో అభివృద్ధి
సాధిస్తున్నదన్నారు. కొన్ని సాంకేతిక రంగాల్లో ద్రోణుల వినియోగం
విస్తరిస్తోందన్నారు. 2030 నాటికి భారతదేశం గ్లోబల్ ద్రోన్ హబ్ గా అభివృద్ధి
చెందనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ ద్రోనిక్స్ ఇంజనీరింగ్
కంపెనీ, ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అవగాహనతో
ఏర్పాటు చేసిన ద్రోన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా
ఉందన్నారు. ఈ కృషిలో భాగస్వాములైన ద్రోనిక్స్ ఇంజనీరింగ్ ఇజ్రాయిల్
ప్రతినిధులను, ధనేకుల కళాశాల యాజమాన్యాన్ని గవర్నర్ అభినందించారు.
భారతదేశంలో, విదేశాలలో వేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీ తయారీపై విద్యార్థులకు
ఉద్యోగ శిక్షణ, పరిశోధన ప్రాజెక్టులపై ఇంటర్షిప్ లను అందిస్తుందన్నారు.
ఏరోనాటికల్ టెక్నాలజీలో నిపుణులు, నిష్ణాతులైన భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ
అబ్దుల్ కలాం స్ఫూర్తిగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని
గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా వివిధ ఇంజనీరింగ్ బ్రాంచ్లలో మెరిట్ సాధించిన
విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా బంగారు, వెండి పతకాలు అందజేశారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, ఇజ్రాయిల్ ద్రోనిక్స్
ఇంజనీరింగ్ కంపెనీ సీఈవో నిర్ జండ్లెర్ జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్స్లర్
జీవీకే ప్రసాద రాజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తొలుత కృష్ణాజిల్లా
జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, గవర్నర్ కు స్వాగతం పలికారు. ధనేకుల
ఇన్స్టిట్యూట్ చైర్మన్ దనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్, డైరెక్టర్ డీకే ఆర్కే రవి
ప్రసాద్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవి, అకాడమిక్స్ మరియు ఆర్ అండ్ డి డీన్
డాక్టర్ ఆర్ సత్య ప్రసాద్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాధిపతి
డాక్టర్ ఎం. వంశీకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు, ద్రోన్ పరిశోధన కేంద్రం
ఇంచార్జ్ గంటా విగ్నేష్ ,ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.