పిల్స్, మెమరీ బూస్టర్స్ అంటూ మార్కెట్లో వివిధ రకాల పేర్లతో ఎన్నో రకాల
మందులు, ఔషధాలను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఒమేగా-3 సప్లిమెంట్లు,
మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ల వంటి వాటిని జనం కూడా ఎక్కువగా కొనుగోలు
చేస్తున్నారు. ఇలాంటి వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని పలు పరిశోధనల్లో
వెల్లడైంది.
శారీరకంగా ఏవైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు, ఏదైనా జబ్బు, వ్యాధులకు
లోనైనప్పుడు వైద్యులు సిఫారసు చేస్తే మాత్రమే అటువంటి సప్లిమెంట్లను
వినియోగించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లేకపోతే ఆ సప్లిమెంట్లతో ఎలాంటి
ఫలితం లేకపోగా.. ఎన్నో దుష్ఫలితాలు (సైడ్ ఎఫెక్టులు) తలెత్తుతాయని, ఉన్న
ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు.మెదడులోని
సున్నితమైన వ్యవస్థలను దెబ్బతీస్తాయని ఇంగ్లాండ్ కు చెందిన రోహంప్టన్
యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు
ఏ రకమైన ప్రొటీన్లు, విటమిన్లు అయినా సహజ ఆహారం రూపంలో శరీరం
సంగ్రహిస్తేనే ప్రభావవంతంగా పనిచేస్తాయని చాలా పరిశోధనల్లో వెల్లడైంది.
అడ్డగోలుగా సప్లిమెంట్లను వినియోగించడం వల్ల అధిక రక్తపోటు, జీర్ణాశయ సమస్యలు,
లైంగిక పటుత్వం కోల్పోవడం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు
తేల్చారు.