ఉన్నారు. కానీ ముందుగా స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి, ఆ తరువాత విలన్ పాత్రల
వైపు వచ్చిన నటుడిగా జగపతిబాబు మాత్రమే కనిపిస్తారు. అయితే ఆయన హీరోగా
చేసినప్పటికంటే, విలన్ పాత్రల ద్వారా వచ్చిన క్రేజ్ ఎక్కువని చెప్పాలి.
కార్పొరేట్ విలనిజమైనా .. గ్రామీణ నేపథ్యంలో విలనిజమైనా గొప్పగా పండించగల
సమర్థుడు జగపతిబాబు. అలాంటి జగపతిబాబు లేకుండా ‘పుష్ప’ సినిమా చూడటానికి
చాలామంది ఇబ్బందిపడ్డారు. అది గ్రహించిన సుకుమార్ ఆయనకి ‘పుష్ప 2’లో ఛాన్స్
ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య జగపతిబాబు దూకుడు కాస్త తగ్గినట్టుగా
అనిపించినా, త్వరలో రానున్న చాలా సినిమాల్లో ఆయన కనిపించనున్నారు.
ప్రభాస్ ‘సలార్’ లోను .. గోపీచంద్ ‘రామబాణం’లోను ఆయన కనిపించనున్నారు.
త్రివిక్రమ్ – మహేశ్ మూవీలోను ఆయనే విలన్. ఇక రీసెంట్ గా వచ్చిన సల్మాన్
సినిమాలో విలన్ గా మెప్పించిన జగపతిబాబు, విలన్ గా మరికొన్ని బాలీవుడ్
సినిమాలు చేస్తున్నారు. ఆయన పవర్ఫుల్ విలన్ గా చేస్తున్న కన్నడ సినిమా కూడా
ఒకటి సెట్స్ పై ఉంది. మొత్తానికి కొత్త విలన్స్ వస్తున్నప్పటికీ, జగపతిబాబు
జోరు ఎంతమాత్రం తగ్గలేదనే చెప్పాలి.