ఓటీటీ సినిమాలకి ఒక రేంజ్ లో ఆదరణ పెరిగిపోతోంది. అలాగే వెబ్ సిరీస్ ల పట్ల
కూడా విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు. దాంతో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ను
అందించడానికి ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఓటీటీ
సెంటర్స్ లోకి కొన్ని సినిమాలు .. వెబ్ సిరీస్ లు దిగిపోతున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 3వ తేదీన ‘తూ జూఠీ మైన్ మక్కర్’ అనే హిందీ సినిమా
స్ట్రీమింగ్ కానుంది. ఇక 5వ తేదీన ‘మీటర్’ సినిమా అందుబాటులోకి రానుంది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా, థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయి
రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. ఇక ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రిజల్టును
రాబడుతుందనేది చూడాలి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘కరోనా పేపర్స్’ అనే మలయాళ సినిమా, జీ 5లో ‘ఫైర్
ఫ్లైస్: పార్ద్ ఔర్ జుగ్ను’ హిందీ సినిమా ఈ నెల 5వ తేదీన స్ట్రీమింగ్
కానున్నాయి. అలా ఈటీవీ విన్ లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ తెలుగు సినిమా కూడా ఈ నెల 5
నుంచే అందుబాటులోకి రానుంది.