రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
హైదరాబాద్ : షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో నవంబర్, డిసెంబర్లో అసెంబ్లీ
ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సన్నాహకాలు
ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం
నిర్వహించిన ఆయన ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితా తదితర విషయాలపై చర్చించారు.