విజయవాడ : భారతదేశ జనాభాలో సింహభాగం ఉన్న వెనుకబడిన తరగతులు (బీసీ) కేంద్ర
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఇంకా వెనుకబాటుతనానికి గురవుతున్నాయని
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ
కులగణన వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశ జనాభాలో సింహభాగం ఉన్న
వెనుకబడిన తరగతులు (బీసీ) కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఇంకా
వెనుకబాటుతనానికి గురవుతున్నాయి. కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీలకు
ఇవ్వాల్సినంత శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు. రిజర్వేషన్ సాధన కోసం అనేక సంఘాలు
ఉద్యమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టి బీసీల జనాభాకు
తగినట్టు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాజంలో వ్యాపార,
ఉపాధి రంగాల్లో బీసీలది అగ్రస్థానం. దేశ భవిష్యత్తును నిర్ణయిం చే స్థాయిలో
బీసీలు ఉన్నారనే విషయాన్ని కేంద్ర ప్ర భుత్వం విస్మరిస్తున్నది. దేశంలో అనేక
రంగాల్లో బీసీ లు రాణిస్తున్నారు. కానీ చాలామంది ఆర్థికంగా ఇంకా వెనుకబడే
ఉన్నారు. బీసీల అభివృద్ధికి తెలంగాణ లాంటి రాష్ర్టాలు ముందుకు వచ్చినా..
కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో బీసీల పరిస్థితి ఎక్కడ వేసిన
గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు
సాగుతున్నా ఆ లక్ష్యం మరింత దూరం పెరుగుతూనే ఉన్న ది. సమాజ ప్రగతి రథ పగ్గాలు
పట్టే సత్తా బీసీలకు ఉ న్నా వారికి తెలియకుండానే ఆ పగ్గాలను కొన్ని శ క్తు లు
లాక్కుంటున్నాయి. నేటికీ బీసీలను పల్లకీ మోయడానికే ఉపయోగించుకుంటున్నాయి.
రాజకీయ పార్టీ లు బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నాయి. బీసీలు తమ
హక్కుల సాధన, రాజ్యాధికారం కోసం అనేక ఏండ్లుగా ఉద్యమిస్తున్నా ఐక్యత లేకపోవడం
వల్ల హక్కుల సాధనలో వెనుకబడుతున్నారు. స్థానిక పంచాయతీ ఎన్నికల్లోనూ
రిజర్వేషన్లు కల్పించాలని కూడా బీసీ సంఘాలు కోరుతున్నాయి. దీనికోసం కేంద్ర
ప్రభు త్వం వెంటనే కులగణన చేపట్టాలి. బీసీ కుల జన గణన జరిగి జనాభా పరంగా
రిజర్వేషన్లు పెరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీ కులగణన, రిజర్వేషన్
పరిధి పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మెజారిటీ ఓటర్లయిన బీసీలు
ఓటేస్తేనే ఏ పార్టీ అయినా మనుగడ సాగిస్తుందన్న విషయాన్ని ఆయా పార్టీలు
విస్మరించరాదు. కులాల వారిగా లెక్కలు తీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని
పార్టీలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయినా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నది.
దేశంలో కుల వివాదాలు రాకుండా ఉండాలంటే కులగణన తప్పనిసరి. 1931 తర్వాత
కులాలవారీ జనాభా లెక్కల సేకరణ జరుగలేదు. 2011లో గణన చేసినప్పటికీ.. ఆ తర్వాత
అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ లెక్కల్ని వెల్లడించలేదు. కులగణన చే యక
పోవడం వల్ల న్యాయంగా అత్యం త వెనకబడిన తరగతులకు రావాల్సిన వాటా నిధులు రావడం
లేదు. రిజర్వేషన్లు అమలు కావడం లేదు. బీసీ గణన కోసం కేంద్ర ప్రభుత్వంపై
రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఒత్తిడి తీసుకు రావలసిన అవసరం ఉన్నదని జాతీయ బీసీ
దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు.