విజయవాడ : శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం వద్ద జరుగుతున్న సహస్త్ర చండీ
యాగం సందర్భంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం
అత్యంత వైభవంగా జరిగింది. అలాగే భాల, కుమారి,సువాసిని పూజలు నిర్వహించారు.
ప్రముఖ ఆధ్యాత్మకులు,యాదలూరి లోకనాధ్ శర్మ, ఎస్ ఏ ఎస్ కళాశాల కార్యదర్శి
రాంపిళ్ల జయప్రకాష్, సమక్షంలో నవ దుర్గలకు పూజ,పుణ్య దంపతులకు పాదపూజలు
నిర్వహించారు. అంతే గాకుండా ఏప్రిల్ 27 నుండి నిత్యం జరుగుతున్న ప్రధాన
యాగశాల్లో సహస్ర చండీ యాగాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. మరో యాగశాల్లో
కుంకుమార్చన లో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ పూజలు అనంతరం శక్తి
పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు ఆధ్వర్యంలో వేలాదిమంది భక్తులకు
అన్నదానం నిర్వహించారు. ఐతే ఈ చండీ యాగం బుధవారం నాడు ముగియనున్న దరిమిలా
రేపు మహా పూర్ణాహుతి,మండప ఉద్వాసనలు,మహా కుంభాభిషేకము, పండితులతో వేద
అశీర్వచనములు జరుగుతాయని పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు తెలిపారు.
మాస్ట్రో గజల్ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర పైబర్ నెట్ కార్పొరేషన్
చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా, సాంస్కృతిక
కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా లఖంరాజు సునీత బాధ్యతలు చేపట్టిన ఈ వేడుకల్లో
లోకనాధ్ శర్మతో పాటుగా పాలఫ్యాక్టరీ సమీపంలోని శ్రీ మాతృ లలితా మండలి
నిర్వాహకులు కొండూరు సుందరి, కమిటీ సభ్యులు జ్ఞానేశ్వర్, చంద్రకళ, వై వి
నాగేందర్, ఫణి కుమార్, బత్తుల వెంకటేశ్వరరావు,వేలాదిమంది మహిళా భక్తులు
పాల్గొన్నారు.