బుజ్జగించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి : వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పంచాయితీ
తాడేపల్లికి చేరింది. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో
సీఎం జగన్‌తో బాలినేని సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మాజీ మంత్రి
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో
ప్రాధాన్యత లేదంటూ బాలినేని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ
నేపథ్యంలోనే ఇటీవల నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ
కో-ఆర్డినేటర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత తాడేపల్లి
రావాలని పిలిచినా బాలినేని స్పందించలేదు. గత మూడు రోజులుగా ఆయన హైదరాబాద్‌లోనే
ఉన్నారు. పార్టీ పదవికి కూడా బాలినేని రాజీనామా చేయనున్నట్లు అనుచరుల నుంచి
వార్తలు రావడంతో ఆయన్ను సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించారు. తాడేపల్లిలోని
క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో బాలినేని భేటీ అయ్యారు. తన అసంతృప్తికి గల
కారణాలపై సీఎం జగన్‌కు బాలినేని వివరించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం
జిల్లాలో, పార్టీలో తన ప్రాధాన్యత తగ్గించే విధంగా ఎవరు పనిచేస్తున్నారనే
అంశంపైనా సీఎం జగన్‌కు పలు ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. వ్యతిరేక
వర్గాలను ప్రోత్సహిస్తున్నారని బాలినేనిపై పలువురు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు
సీఎంకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. బాలినేని శ్రీనివాస్ వారిని పట్టించుకోవడం
లేదని, వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని పలువురు అధిష్ఠానం దృష్టికి
తీసుకెళ్లారు. వీటన్నింటిపైనా బాలినేనిని జగన్ వివరణ అడిగినట్లు తెలుస్తోంది.
ఆది నుంచి పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన ముఖ్యనేత అయిన బాలినేని ఇలా
పార్టీ పదవుల నుంచి తప్పుకోవడంపై వైసీపీ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు
తెలుస్తోంది. బాలినేనిని బుజ్జగించి తిరిగి నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల
సమన్వయకర్తగా మళ్లీ బాధ్యతలు తీసుకునేలా సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించినట్లు
సమాచారం. సీఎం ఎంత సేపు సముదాయించినా బాలినేని మెత్తబడలేదని తెలుస్తోంది. ఎంత
చెప్పినా రీజినల్ కోఆర్డినేటర్‌గా కొనసాగేది లేదని బాలినేని తెగేసి
చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం. దీంతో పార్టీ పదవికి బాలినేని చేసిన
రాజీనామా ఉపసంహరణ విషయంపై ఇంకా సందిగ్ధత తొలగలేదు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం
బాలినేని శ్రీనివాస్ మీడియా కంట పడకుండా మరో దారిలో సీఎం క్యాంపు కార్యాలయం
నుంచి వెళ్లిపోయారు.