తానేటి వనిత
కొవ్వూరు : తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి
పర్యటన మే 24కు వాయిదాకి పడినట్లు రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షాలు
కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కొవ్వూరు
క్యాంపు కార్యాలయం నుండి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వాలంటీర్లకు
వందనం’ కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న
కొవ్వూరులో నిర్వహిస్తామన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనపై ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమీక్ష..
కొవ్వూరులో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని
రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలోని సర్పంచ్ లు,
ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్స్, ఇతర
ప్రజాప్రతినిధులు, నాయకులతో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం హోంమంత్రి
సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్ధేశనం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యత
తీసుకోవాలని, అందరి సమిష్టి కృషితో ముఖ్యమంత్రి సభను విజయవంతం చేస్తామని ఆమె
తెలిపారు. ‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా సేవలు అందిస్తున్న
వాలంటీర్లకు పురస్కారాలను అందించడానికి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు
నియోజకవార్గానికి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
వస్తుండటం సంతోషకర విషయమన్నారు. ముఖ్యమంత్రి సభ ఎప్పుడు నిర్వహించినా గ్రాండ్
సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్క అభిమాని, కార్యకర్త ఉత్సాహంగా ఉన్నారని
హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.