నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.3,000 భృతి
సర్వ జనాంగద శాంతియ తోట పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో
బజరంగ్దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలపై నిషేధం
కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల…ఉచిత హామీలు
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మంగళవారం
మేనిఫెస్టోను విడుదల చేసింది. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం
కాంగ్రెస్ పార్టీ మంగళవారం సర్వ జనాంగద శాంతియ తోట పేరుతో మేనిఫెస్టోను విడుదల
చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కుటుంబ పెద్దలకు నెలకు రూ. 2,000,
నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.3,000, డిప్లొమా ఉన్నవారికి నెలకు
రూ.1,500 చొప్పున ఇస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ
ఇచ్చింది. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఒక సంవత్సరంలోగా భర్తీ
చేయడాన్ని కూడా కాంగ్రెస్ పరిశీలించనుంది.గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న
భాగ్య, యువ నిధి, శక్తి. గృహ జ్యోతి పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు
హామి ఇచ్చారు. అన్నభాగ్య పథకం కింద10కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందిస్తామని
నేతలు చెప్పారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉపాధి కల్పన, మహిళలకు సాధికారత,
పేదరికాన్ని నిర్మూలించడంపై దృష్టి సారిస్తామని కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్
చెప్పారు. ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున్ ఖర్గే,
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు విడుదల చేశారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్
చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నికల వేళ పార్టీ మేనిఫెస్టోలో ఆకర్షనీయంగా
పలు పథకాలను, హామీలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్యారెంటీ కార్డు పేరుతో
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక
కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టోను
విడుదల చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మైనార్టీ వర్గాల
మద్య ద్వేషాన్ని ప్రొత్సహించే వ్యక్తులు, సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే, బజరంగ్దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలపై నిషేధం విధించడంతోపాటు చట్ట
ప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.
మరో వైపు 2006 నుండి సర్వీస్‌లో చేరిన పెన్షన్ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు ఓ పీ
ఎస్ పొడిగింపును కాంగ్రెస్ పరిశీలిస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని
ఖాళీలను ఒక సంవత్సరంలోగా భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
మేనిఫోస్టో వివరాలు ఇవే
గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్
గృహలక్ష్మి కింద ప్రతి ఇంటికి గృహిణికి నెలకు రూ. వేలు
అన్న భాగ్య పథకం కింద ప్రతీ వ్యక్తికి 10కిలోల బియ్యం
శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
యువనిధి నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు(రెండేళ్లపాటు) అందజేత
డిప్లొమా చేసిన వారికి రూ.1500