ఆర్.కె.రోజా
పుత్తూరు : రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, దాని ఫలితమే
ఉద్యోగ విజయోత్సవమని రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల ,
క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని
పిళ్ళారిపట్టు పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జరిగిన ఉద్యోగ విజయోత్సవం
కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్
ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
పిళ్ళారిపట్టు పాలిటెక్నిక్ కాలేజీ ని ఏ లక్ష్యంతో అయితే అభివృద్ధి చేశాన,
ఇంత మంచి భవనాన్ని ఎందుకోసం నిర్మించామో, లక్ష్యం ఈరోజు నెరవేరినందుకు చాలా
సంతృప్తిగా ఉందని అన్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో
విద్యార్థులకు ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ నిర్వహించడం, వారిలో స్కిల్స్
అభివ్రుద్ధి చేయడమే కాకుండా, క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి మన
విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వచ్చేలా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉందని హర్షం
వ్యక్తం చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలలో ట్రైనింగ్ పొందిన వారికి క్యాంపస్ ఇంటర్వ్యూలు
నిర్వహించి ఇప్పటికే వివిధ కంపెనీలలో మొత్తం 62 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఆ
విద్యార్థులనే కాదు, ఇంత మంచిగా శిక్షణ ఇస్తున్నవారికి కూడా అభినందనలు
తెలుపుతున్నానని అన్నారు. మన ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు, మన
ప్రభుత్వం ఇచ్చే శిక్షణ ల వలన ఏడాదికి లక్షా 80 వేల నుండి 2 లక్షల 60 వేల వరకు
జీతాలు పొందే ఉద్యోగాలు వస్తున్నాయని అభినందించారు. జగనన్న ప్రభుత్వం లో
ఉన్నత విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు ఏవిధంగా పెంచి, విద్యార్థులకు మంచి
భవిష్యత్ ఇస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అన్నారు. గత
ప్రభుత్వంలో నిరుద్యోగులు, విద్యార్థులకు స్కిల్ డెవలప్ మెంట్ అంటే ఓ పెద్ద
స్కామ్ అని చంద్రబాబు పాలనలో స్కిల్ డెవలప్ మెంట్ లో 373 కోట్లను డొల్ల
కంపెనీల ద్వారా కొల్లగొట్టాడని విమర్శించారు. ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై
సీఐడీ విచారణ మాత్రమే కాదు, సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ అయిన ఈడీ
విచారణ కూడా సాగుతోందని, మొన్ననే ఈ స్కామ్ లో 30 కోట్ల ఆస్తులను కూడా డిజైన్
టెక్ సంస్థకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని తెలిపారు. ఎందుకు ఇక్కడ ఈ
విషయం ప్రస్తావిస్తున్నానంటే విద్యార్థుల కోసం, వారి ఉద్యోగాల కల్పన కోసం ఎవరు
చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నారో గమనిస్తారని చెప్తున్నానని అన్నారు.
జగనన్న అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని,
లక్షా 30 వేల సచివాలయ ఉద్యోగాలు, నాలుగు వేలకు పైగా టీచర్ పోస్టులు, 50 వేల
మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని, 49 వేల ఉద్యోగాలను వైద్య
రంగంలో భర్తీ చేశామని, ఇవి కాకుండా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో
వేలాది ఉద్యోగాలు కల్పించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 175
నియోజకవర్గాల్లో స్కిల్ హబ్ లు ఏర్పాటు చేసి, మీలాంటి యువతకు నైపుణ్యాల శిక్షణ
ఇస్తున్నారని, డిగ్రీ, బి టెక్ విద్యా విధానాల్లోనే మార్పులు తెచ్చి, మంచి
సిలబస్ తెచ్చి, ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో
పెంచుతున్నారని పలితంగా భవిష్యత్ లో దేశంలోను, విదేశాల్లోను ఎక్కడైనా మన
పిల్లలు ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ మీడియం విద్య అవసరం అని ఇంగ్లీష్ మీడియం
విద్యను తీసుకొచ్చారని, అంతేకాదు సీబీఎస్ ఈ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో
తీసుకొచ్చి మన విద్యార్థుల భవిష్యత్ కోసం జగనన్న ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ
కార్యక్రమంలో పుత్తూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు,
ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, రాష్ట్ర డైరెక్టర్లు, వివిధ
కమిటీల చైర్మన్లు, సభ్యులు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు,
ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.