సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల
సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ .. జేఆర్సీ కన్వెన్షన్ లో
నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హరీశ్ శంకర్ .. అనిల్ రావిపూడి .. బుచ్చిబాబు
.. విష్వక్సేన్ .. అడివి శేష్ .. సందీప్ కిషన్ తదితరులు హాజరయ్యారు.
శివ నిర్వాణ మాట్లాడుతూ .. ” అల్లరి నరేశ్ ఎప్పటికప్పుడు తన జోనర్స్ ను
మార్చుకుంటూ వెళుతున్నారు. నేను .. గమ్యం .. నాంది సినిమాలు అలా వచ్చినవే. అదే
తరహాలో ఇప్పుడు ‘ఉగ్రం’ వస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేస్తే, ఆయన కొత్త
కథలను .. కొత్త దర్శకులను పరిచయం చేస్తారు” అని అన్నారు.
దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ … “ఈ సినిమా షూటింగును 73 రోజుల్లో
పూర్తి చేశాను. 50 రోజుల పాటు రాత్రివేళల్లోనే షూటింగు చేశాము. ఆర్ట్
డైరెక్టర్ బ్రహ్మకడలి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. 4 రోజుల్లోనే భారీ సెట్
వేయడం ఆయనకే సాధ్యమైంది. నరేశ్ నటన .. శ్రీచరణ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా
నిలుస్తాయి . థియేటర్స్ దద్దరిల్లిపోతాయి ” అని చెప్పుకొచ్చారు.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. “నా శిష్యులు ఎవరూ దర్శకులు కావడం లేదంటూ ఈ
మధ్య సుకుమార్ నన్ను ర్యాగింగ్ చేస్తున్నాడు. విజయ్ కనకమేడల ఆ లోటును భర్తీ
చేశాడు. ఈ జనరేషన్ లో 100 సినిమాలను పూర్తిచేసే హీరోగా అల్లరి నరేశ్ మాత్రమే
కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన అల్లరి కూడా చేయాలని కోరుకుంటున్నాను”
అన్నారు.
అల్లరి నరేశ్ మాట్లాడుతూ .. ఇంతకుముందు నేను నవ్వించాను ..
ఏడిపించాను. ఈ సారి నా ఉగ్రరూపం ఎలా ఉంటుందనేది చూస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.