హైదరాబాద్ : రాష్ట్ర నూతన సచివాలయంలో విద్యుత్ శాఖ ఇంజినీర్లు, అధికారులతో
మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో భాగంగా ఈదురు
గాలులు, భారీ వర్షాలతో పడిపోయిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులు,
అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి చర్చించారు. ఈదురు గాలులతో
చెట్లు విరిగి స్తంభాలపై పడడంతో వైర్లు తెగిపడడం వంటి ఘటనలు చోటు
చేసుకుంటాయని, అటువంటి వాటిపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో అకాల
వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండటంతో విద్యుత్ శాఖ ఇంజినీర్లు, సిబ్బంది
అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అకాల వర్షాలతో విద్యుత్ శాఖకు సంభవించిన
నష్టాలపై డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవనంలో మంత్రి జగదీశ్ రెడ్డి తన
ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒ.అండ్.ఎం సిబ్బంది అప్రమత్తంగా
ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. ఈదురు గాలులతో వైర్లు
తెగిపడితే తక్షణమే సిబ్బంది స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని
ఆయన సూచించారు. సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ,
ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా
రెడ్డి తదితరులు పాల్గొన్నారు.